రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చౌటుప్పల్,మార్చ్19,(గరుడ న్యూస్ ప్రతినిధి):
బీసీ లో విద్య ఉద్యోగాల్లో,స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రాజకీయ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల ముప్పిడి కృష్ణ చైతన్య గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ చట్టం బీసీల మొదటి పోరాట విజయమని పేర్కొన్నారు.కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అసెంబ్లీలో బిసి రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ చట్టం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,కి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,కి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,కి మునుగోడు ఎమ్మెల్యే కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కి సమస్త బీసీ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని ముప్పిడి కృష్ణ చైతన్య గౌడ్ అన్నారు.
