


తిరుపతి జిల్లా, పాకాల గరుడ న్యూస్ (ప్రతినిధి): పాకాల మండలం పంటపల్లి, పుదిపట్లబైలు పంచాయతీలో మహిళలతో ముఖా ముఖి కార్యక్రమం. మహిళలతో ముఖా ముఖి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి. పాకాల మండలం పంటపల్లి పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డికి మేలతలాల మధ్య మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది గజమాలతో ఘన స్వాగతం పలికిన కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి గారు. అనంతరం పంటపల్లి పంచాయతీలోని సమస్యలను మహిళలను అడిగి తెలుసుకుని. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి త్వరగతన పరిష్కారమయ్యే పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని మహిళలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి. ఎమ్మెల్యే సొంత మండలం అయిన పాకాల మండలంను సమస్యల రహిత మండలంగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు ప్రజలకు తెలిపిన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి. సాంకేతిక వైఫల్యంతో అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు మనోనిబ్బరంతో గడిపి, నేడు భూమి మీదకు సురక్షితంగా తిరిగి వస్తున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ గారికి చంద్రగిరి నియోజకవర్గం మహిళల తరఫున స్వాగతం పలుకుతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధా రెడ్డి.
