

సంగారెడ్డి జిల్లా మనూర్ మండల పరిధిలోని గట్టు లింగంపల్లి గ్రామం లో ఈరోజు నూతన్ బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గట్టు లింగంపల్లి నుండి బోరంచ వయా దుదగొండ,రుద్రారం వరకు పిఎమ్ జియస్ వై నిధుల ద్వారా 3కోట్ల 50లక్షల రూపాయలతో నూతన బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ రెడ్డి
అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో దివంగత నాయకులు పట్లోళ్ల కిష్టారెడ్డి మాజీ శాసనసభ్యులు ఉన్నప్పుడు ఈ రోడ్డును వేయడం జరిగింది గత పది సంవత్సరాల నుండి ఈ రోడ్డును పట్టించుకున్న నాయకుడే లేరు కానీ మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా గ్రామానికి రోడ్డు మంజూరు చేసినందుకు మా గ్రామాల తరఫున మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని ఎమ్మెల్యేకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మాజీ సర్పంచులు, రాజు, బ్రహ్మానందరెడ్డి, ఖేడ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివకాంత్ పాటిల్,చందు పాటిల్,అనిల్ పాటిల్, నర్సింహ గౌడ్ ,విఠల్ రెడ్డి ,మల్లేష్,అరుణ్,రాజు , దుదగొండ గ్రామ ప్రజలు, పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు


