గరుడ న్యూస్,రాయగడ(ఒడిశా)
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మజ్జి గౌరమ్మ తల్లి దర్శనానికి దేశ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తుంటారు.ప్రతి ఏడాది చైత్ర మాసం ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు మజ్జి గౌరమ్మ చైత్ర పండుగ నిర్వహిస్తారు.చైత్ర హోమం జరుపుతారు.ఇక్కడ జరిగే అగ్ని మల్లెలు కార్యక్రమం లో ఆలయ అర్చకులు కణ కణ మండే అగ్ని నిప్పుల పై నడుస్తారు.అనంతరం పిల్లలు,వృద్దులు కూడా అగ్గి లో నడుస్తారు.తదుపరి ఘట్టం పూజారి మేకులతో నిండి ఉన్న ముళ్ళ ఉయ్యాల పై ఊగుతారు.ప్రత్యేక వినోద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకం గా పండుగ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.




