రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చౌటుప్పల్,మార్చి20,(గరుడ న్యూస్ ప్రతినిధి):
దశబ్దాలుగా సుదీర్ఘమైన డిమాండ్లను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బక్క శ్రీనాథ్ అన్నారు.గురువారం చౌటుప్పల్ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ,బీసీ కుల గణనను అసెంబ్లీలో ఆమోదం తెలిపిన మంత్రి వర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి కి,మంత్రి దామోదర రాజనర్సింహ్మ,కి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్ పాల్గొని మాట్లాడుతూ మాదిగ జాతి సోదరుల చిరకాల డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణ ఒకవైపు,బీసీలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు బీసీ కులగణన మరోవైపు నిర్వహించి.సామా జిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి రుజువు చేసిందన్నారు.ఎస్సీ వర్గీ కరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించగానే తెలంగాణ ప్రభుత్వం ఏక సభ్య కమీషన్ ద్వారా సమగ్ర అధ్యయనం చేయించి అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టిందని వివరించారు.అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని,అందుకు తగినట్లుగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటూ బలహీనవర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు,లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊదరి నరసింహ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఊదరి శ్రీనివాస్,మాజీ సర్పంచ్ లు ఊదరి నరసింహ,గుడ్డేటి యాదయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఊదరి వెంకటేష్ మహాజన్,బర్రె నరసింహ,ఎర్రగుంట వెంకటేష్,కొమ్ము లక్ష్మయ్య,బండమీది వెంకటేష్ ,బండమీది ఎల్లయ్య, ఊదరి రమేష్,ఎర్ర శంకర్,ఊదరి శంకర్, మాదాని గోపాల్,పస్తం గంగారాములు,గుడ్డేటి దశరథ,బోయ వెంకట్,బోయ ఆనంద్ ,బోయ అరవింద్,బోయ సంపత్,తూర్పుంటి వంశీ,దాసరి శివ,తదితరులు పాల్గొన్నారు.



