
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి20,(గరుడ న్యూస్ ప్రతినిధి):
దశబ్దాలుగా సుదీర్ఘమైన డిమాండ్లను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఎండి అక్బర్ అలీ అన్నారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఒకవైపు,బీసీలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు బీసీ కులగణన మరోవైపు నిర్వహించి అన్ని వర్గాల సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి రుజువు చేసిందన్నారు.అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని,అందుకు తగినట్లుగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటూ బలహీనవర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు,లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.
