రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి21,(గరుడ న్యూస్ ప్రతినిధి):
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఏలె సుభాష్ చంద్రబోస్ గతంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినప్పటికీ నేడు కేంద్ర రక్షణ శాఖలో ఆడిటర్ గా ఉద్యోగం సాధించిన సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ మైనార్టీ నాయకులు ఎండి రహీం షరీఫ్ శాలువ కప్పి ఘనంగా సన్మానం చేసి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.అనంతరం రహీం షరీఫ్ మాట్లాడుతూ ఏలే సుభాష్ చంద్రబోస్ నారాయణపురం మండలంలో పుట్టి ఇంత మంచి ఉద్యోగానికి ఎన్నికవ్వడం నారాయణపురం మండలానికి గర్వంగా ఉందని అదేవిధంగా నేటి యువత చెడుదారులకి పోకుండా ఏలే సుభాష్ చంద్రబోస్ ను స్ఫూర్తిగా తీసుకొని ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాలని యువతను కోరడం జరిగింది.




