
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి22,(గరుడ న్యూస్ ప్రతినిధి):
మునుగోడు నియోజకవర్గం చర్లగూడెం రిజర్వాయర్ సందర్శించిన సంస్థాన్ నారాయణపురం కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఎండి అక్బర్ అలీ, కాంగ్రెస్ పార్టీ మండలం మాజీ అధ్యక్షులు ఏపూరు సతీష్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెర్లగూడెం రిజర్వాయర్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి కాబోతోందని ఈ యొక్క రిజర్వాయర్ యొక్క నీటి వలన మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని,పంటలు సమృద్ధిగా పండుతాయి అని మునుగోడు నియోజకవర్గం అని సస్యశ్యామలమవుతుందని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు మినుగు గోపాల్,అంతటి స్వామి,అబ్బన గోని వంశీ యాదవ్,రిపోర్టర్ సింగం కృష్ణ,తదితరులు,పాల్గొన్నారు.

