పార్వతీపురంలో చెత్త… చెత్తే గాని సంపద కాదు…!

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
3 Min Read

చెత్త నుండి సంపద సృష్టి ఉత్తుత్తి మాటలే…!

కానరాని చెత్త శాగ్రిగేషన్ పనులు

ఎన్నికల హామీగా మిగిలిన చెత్త డంపింగ్ యార్డ్

పార్వతీపురం ప్రజలకు కలగా మిగిలిన చెత్త డంపింగ్ యార్డ్ తరలింపు

మున్సిపల్ పాలకులు, అధికారుల్లో కొరవడిన చెత్తశుద్ధి

చెత్తతో గోప సాగరాన్ని కబ్జా చేస్తున్న మున్సిపాలిటీ

పార్వతీపురం చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పార్వతీపురంలో చెత్త… చేత్తే గాని సంపద కాదని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ఆదివారం ఆ పార్టీ ఓబిసి పార్వతిపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, నియోజకవర్గం చైర్మన్ సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, జిల్లా నాయకులు కోలా కిరణ్ కుమార్, మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు, మాజీ కౌన్సిలర్ బొమ్మాలి మోహనరావు, మండల నాయకులు మామిడి చంద్రకుమార్ తదితరులు పార్వతీపురం పట్టణం రాయగడ రోడ్డు లో ఉన్న మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీ ఇంచార్జ్ బత్తిన మోహన్ రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. ప్రతిరోజు పార్వతీపురంలో తయారవుతున్న సుమారు 15 మెట్రిక్ టన్నుల చెత్తను మున్సిపాలిటీ వృధాగా డంప్ చేస్తుందన్నారు. రాష్ట్రమంతా చెత్త నుండి సంపద సృష్టించేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంటే పార్వతీపురం మున్సిపాలిటీలో మాత్రం చెత్త నుండి సంపద సృష్టి ఉత్తుత్తి మాటలే అన్నారు. ఎందుకంటే ఇక్కడ తడి చెత్త పొడి చెత్త శాగ్రిగేషన్ కానీ, తడి చెత్త నుండి వర్మి కంపోస్టు లాంటి జీవ ఎరువులు తయారీ గాని కానరావడం లేదు అన్నారు. పార్వతీపురం చెత్త డంపింగ్ యార్డ్ రాజకీయ పార్టీలకు ఎన్నికల హామీగా మిగిలిందన్నారు. పార్వతీపురం ప్రజలకు శాపంగా మారిన చెత్త డంపింగ్ యార్డ్ తరలింపు విషయంలో వైసిపి విఫలమైందన్నారు. దాన్ని ఎన్నికల హామీగా చూపిస్తూ అధికారంలోకి వచ్చిన కూటమి పాలకులు కూడా చెత్త డంపింగ్ యార్డ్ తరలింపులో చొరవ చూపకపోవడం పార్వతిపురం ప్రజల దౌర్భాగ్యం అన్నారు. చెత్త డంపింగ్ యార్డ్ తరలింపు అనేది పార్వతీపురం ప్రజలకు కలగా మిగిలింది అన్నారు. మున్సిపల్ అధికారులు పాలకుల్లో చెత్తశుద్ధి కొరవడిందన్నారు. దీంతో విలువైన సంపద సృష్టించే చెత్త నిరుపయోగంగా మారుతోందన్నారు. ఇది ఇలా ఉండగా చెత్త డంపింగ్ యార్డ్ నెపంతో చెత్త డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న గోప సాగరాన్ని ఆక్రమణకు పాల్పడుతున్నారన్నారు. చెత్త డంపింగ్ యార్డ్ కు పక్కనే ఉన్న గోప సాగరంలో చెత్తను డంప్ చేయడం వలన నీరు కలుషితం అవుతుందన్నారు. దానివలన చేపలకు హాని కలిగి మత్స్యకారులు నష్టానికి గురవుతున్నారన్నారు. పొలాలకు వెళ్లే నీరు సైతం కలుషితం కావడంతో పంటలు పాడవుతున్నాయన్నారు. రాష్ట్రంలో దాదాపు గ్రామాలలో చెత్త నుండి సంపద కేంద్రాలను నిర్వహించి, చెత్తను సంపదగా తయారు చేస్తున్నారన్నారు. కానీ పార్వతీపురం మున్సిపాలిటీలో అందుకు విరుద్ధంగా… చెత్తను చెత్తగానే పరిగణిస్తున్నారు తప్ప… చెత్త నుండి సంపద తయారు చేసే మాట కాన రావటం లేదన్నారు. గతంలో లక్షలాది రూపాయలు డంపింగ్ యార్డ్ తరలింపుకు వృధా చేసిన సందర్భాలు లేకపోలేదన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పార్వతీపురంలో చెత్తను సంపదగా మార్చాలన్నారు. అలాగే చెత్త డంపింగ్ యార్డ్ తరలింపుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *