
గరుడ ప్రతినిధి (చౌడేపల్లి)
నిరక్షరాస్యలను నిర్మూలించేందుకు ప్రభుత్వం ఉల్లాస్ పరీక్షలను నిర్వహిస్తోందని వెలుగు ఎపిఎం సుబ్రమణ్యం తెలిపారు ఈ మేరకు ఆదివారం మండలంలోని నిరక్షరాస్యులకు పరీక్షలు నిర్వహించారు మండల వ్యాప్తంగా గల 19 పంచాయతీల్లోని 33 కేంద్రాల్లో 365 మంది నిరక్షరాస్యులు పరీక్షలు రాసినట్లు ఆయన వివరించారు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా మొదటి విడత పూర్తి అయిందని రెండవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు
