డా నగేష్ రెడ్డి కి ఉత్తమ సర్వీస్ అవార్డు

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

గజపతినగరం లో జరిగిన లయన్స్ క్లబ్ రీజినల్ సమావేశంలో జోన్ లో ఉన్న ఏడు క్లబ్ ల మీటింగ్ నిర్వహించారు . అందులో భాగంగా లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను సమీక్షించి ఇందులో భాగంగా పార్వతీపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న అనేకరకమైన సేవలను కొనియాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న నేత్ర వైద్య సేవలలో భాగంగా మన్యం జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి జీరు.నగేష్ రెడ్డి చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ  బెస్ట్ సర్వీస్ అవార్డు ను రీజినల్ చైర్ పర్సన్ సాగి రోహిణి రాజు చేతులు మీదుగా అందుకున్నారు.ఈ కార్యక్రమములో క్లబ్ అధ్యక్షులు నాగభూషణ రావు, కార్యదర్శి బుజ్జి మరియు మంచిపల్లి శ్రీరాములు, ద్వారపురెడ్డి శ్రీదేవి మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *