
షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం!
గరుడ న్యూస్,సాలూరు
ఆదివారం సాలూరు పట్టణ ప్రాంతంలో మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ ఆద్వర్యం లో నవోదయ సేవా సంఘం, వెలం పేట వారి సహకారంతో రక్త దాన శిబిరం ప్రారంభించి 7 సంవత్సరాలు జయప్రదంగా సేవలందించి 8 వ రక్తదాన శిబిరం వెలంపేట లో పెట్టినందుకు గానూ వేలంపేట సేవ సంగం – నవోదయ సేవా సంఘం వారు , మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొరను ఆహ్వానించారు. శిబిరానికి వెళ్లిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించి రక్తదానం చేసిన యువత కి సంబంధిత గౌరవ సర్టిఫికెట్స్ ఇచ్చి వారిని అభినందించి , మీరు చేసిన రక్తదానం కొంత మంది ప్రాణాలను కాపాడుతాయి , ఇలాగే మరెన్నో మంచి పనులు చేయాలని వెలంపేట యువతకి ప్రోత్సహిస్తూ కొనియాడారు .
ఈ కార్య్రమంలో టౌన్ ప్రెసిడెంట్ వంగపండు అప్పలనాయుడు , జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రచార అధ్యక్షులు గిరి రఘు , జిల్లా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ మోకాశ లక్ష్మణరావు , నియోజక వర్గ వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగ అధ్యక్షులు మజ్జి అప్పారావు , నియోజక వర్గ మున్సిపల్ విభాగ అధ్యక్షులు కొల్లి వెంకటరావు , వెలమపేట నాయకులు , యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

