నిద్రవస్థలో మానుకోట కాంగ్రెస్.
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి పెనుగొండ రామారావు మార్చి 24 (గరుడ న్యూస్)
అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ ఏ మెరుగనిపిస్తుంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మానుకోటలో మళ్లీ టీఆర్ఎస్ వచ్చే పరిస్థితిలో ఉందా?.
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పట్టణంలో ఎక్కడ జరిగిన పట్టుమని 100 మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా హాజరు కాని పరిస్థితి.
10 సంవత్సరాలు మానుకోట ఎమ్మెల్యేగా పరిపాలన చేసిన మాజీ ఎమ్మెల్యే వస్తే వందలాదిమంది కార్యకర్తలు ఆయన వద్దకు వస్తారు.
మాజీ ఎమ్మెల్యే కాలంలో క్యాంప్ ఆఫీసు నుండే కార్యకలాపాలు నిర్వహించేవారు.
ఆనాటి రోజులలో క్యాంప్ ఆఫీస్ కార్యకర్తలతో, కళకళలాడుతూ ఉండేది.
ఈనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే హయాంలో క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలు, నాయకులు లేక వేలవేల పోతున్న క్యాంప్ ఆఫీస్.
మాజీ ఎమ్మెల్యే పట్టణంలో ఏదైనా ప్రోగ్రాం పెడితే బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే తో వందల సంఖ్యలో పాల్గొని ఫాలోయింగ్ లో ఉంటున్నారు.
ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే మాజీ ఎమ్మెల్యే 50 వేల పై చిలుకు ఓట్లతో గెలుస్తా డని రాజకీయ పరిశీలన అంచనా!.
కాంగ్రెస్ పార్టీలో ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే, కార్యకర్తలు, రెండవ శ్రేణి నాయకుల అభిప్రాయం ప్రకారం రాబోయే మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలలో పార్టీ పరాభవం తప్పదని గుసగుసలు వినిపిస్తున్నాయి.




