
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చ్24,(గరుడ న్యూస్ ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,తెలియజేయడం,ఈనెల 30న హుజూర్ నగర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలియజేయడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంతోషకరమని కాంగ్రెస్ భువనగిరి జిల్లా కార్యదర్శి ముద్దంగుల నరసింహ్మ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తుందని చెసేదే చెబుతుందని,రాజీవ్ యువ వికాస్ పథకాన్ని కూడా నిరుద్యోగ యువత వారి యొక్క అర్హతను బట్టి దరఖాస్తులు చేసుకోవాలని,కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన తెలియజేశారు.

