గరుడ న్యూస్,విజయనగరం
సోమవారం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ద్వితీయ పుత్రుడు మజ్జి ప్రణీత్ బాబు మరణం తర్వాత 6వ రోజున చిన్న శ్రీనుని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ,తుని మాజీ శాసనసభ్యులు జక్కాపూడి రాజా,పాలకొండ మాజీ ఎమ్మెల్యే తలై భద్రయ్య , ప్రస్తుత కూటమి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుడితి ఈశ్వరరావు, మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవి వెంకటేశ్వరరావు,మాజీ వుడా చైర్మన్ రవి రాజు, వివిధ మండలాల జడ్పిటిసిలు,ఎంపీపీలు పంచాయతీ ప్రెసిడెంట్లు,ఎంపీటీసీలు,మాజీ చైర్మన్లు,మాజీ డైరెక్టర్లు,ఇలా ప్రముఖులు పరామర్శంచి చైర్మన్ కుటుంబానికి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రణీత్ బాబుకి నివాళులర్పించడం జరిగింది.







