

దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి అందులో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుజాల్ పూర్ శివారులో గల ఈ తక్షిల విద్యార్థులు నవోదయ విద్యాలయంకి ఎంపిక కావడం జరిగింది. ఈ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ లో మంచి ర్యాంకులు సాధించిన ఈ తక్షిల విద్యార్థులు సంజయ్ కృష్ణ రెడ్డి, వినయ్,హరి ప్రసాద్ రెడ్డి,మణికంఠ నవోదయ ఎంపిక పట్ల పాఠశాల కరస్పాండెంట్ శరత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. వీరిని అభినందిస్తూ మంచి స్థాయిలో ఎదగాలని తెలుపుతూ మరియు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.