
గరుడ న్యూస్,గజపతినగరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కార్పెంటర్స్ డే సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం నుంచి గంగరాజు థియేటర్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వ బాలుర పాఠశాలలో రిపేర్ వర్క్స్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎస్సై కే. లక్ష్మణరావు ప్రారంభించారు. అలాగే కార్పెంటర్లందరకు శుభాకాంక్షలు తెలియజేశారుఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు బొద్దూరు వీరన్న, అండ్లూరి గణేష్ . శివాజీ, సూరిబాబు, వీరాచారి, అప్పలాచారి,జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


