రిపోర్టర్ సింగం కృష్ణ, భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి28,(గరుడ న్యూస్ ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం యువతి,యువకులు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోతు కిషన్ నాయక్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు ఆర్థిక చేయూతను అందించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.




