రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,గుడిమల్కాపురం,మార్చి28,(గరుడ న్యూస్ ప్రతినిధి):
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని గుడిమల్కాపురం గ్రామంలో తాగునీటి అవసరాల కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతనంగా మంచి నీటి బోరు వేయించారు.గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దంగుల నరసింహ్మ,కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నె నరసింహ్మ రెడ్డి,అంతటి ధనరాజ్ గౌడ్,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.




