గరుడ న్యూస్,పాచిపెంట
ద్రవ జీవామృతం ద్వారా పంటకు కావలసిన అన్ని రకాల పోషకాలు అందించవచ్చని, ముఖ్యంగా భూమిలో అందని స్థితిలో ఉన్న పోషకాలను మొక్క తీసుకునే స్థితిలోకి మార్చడానికి నేలలో ఉన్న జీవ వైవిధ్యం ఎంతో అవసరమని, ఈ జీవ వైవిధ్యం చురుకుగా పనిచేసే పోషకాలను మొక్కకు అందించటానికి ద్రవ జీవామృతం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. రైతు ఎస్ నారాయణరావు తన ఆయిల్ పామ్ పంటకు ప్రకృతి సేద్య ఎల్ వన్ తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో 600 లీటర్ల ద్రవ జీవామృతాన్ని తయారు చేశారు అంతేకాకుండా 100 కేజీల ఘన జీవామృతాన్ని మంచి ఎరువు తయారు చేసుకోవడానికి సహజ నాయుడు కంపోస్ట్ పిట్ ను కూడా తయారు చేసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులందరూ వేసవి కాలం అంతా సహజ ఎరువుల తయారీ పై దృష్టి సారిస్తే రసాయన ఎరువులు పై ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చని అంతేకాకుండా ప్రభుత్వానికి ఎరువుల పై సబ్సిడీ భారాన్ని కూడా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదిబిల్లి శ్రీను, రైతులు పాల్గొన్నారు.
