చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం: గరుడ న్యూస్ (ప్రతినిధి):
గురువారం గ్లోబల్ స్టార్ ఆస్కార్ అవార్డు గ్రహీత రామ్ చరణ్ జన్మదిన వేడుకలు కుప్పం పట్టణం నందు ఘనంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్వర్యంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో రామ్ చరణ్ పేరుతో పూజా కార్యక్రమాలు చేపట్టారు.పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ జై చరణ్ నినాదంతో బారి కేక్ కట్టింగ్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ విచ్చేశారు. సీనియర్ నాయకులు పవన్, మహేష్, రూపేష్, పూలు శేఖర్, రాంచరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు అరుణ్ చెర్రీ, శ్రీకాంత్ , బాలాజీ, వినీత్, వాసు, నూరు భాయ్, నవీన్, రవి తదితరులు పాల్గొన్నారు.






