తిరుపతి జిల్లా,చంద్రగిరి నియోజకవర్గం,పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): దామలచెరువు సమీపంలోని కుక‌్కలవారి పల‌్లి మలుపులో ద‌్విచక‌్రవాహనం అదుపు తప్పి బస‌్సును ఢీకొనడంతో మృతి చెందిన ద‌్విచక‌్ర వాహన దారుడు. ముందు వెళుతుండిన పాల వ‌్యానును ఓవర్ టేక్ చేసి ఎదురుగా వస‌్తుండిన పుంగనూరు బస‌్సును ఢీకొన్న దామల చెరువు నుంచి పాకాల వైపు ప్రయాణిస్తున్న ద‌్విచక‌్ర వాహనం.
ప్రమాదవసత్తు సంఘటనా స్థలంలోనే మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడు అసీక్(19). మృతుడు దామలచెరువు ఆజాద్ నగర్ కు చెందిన వాడిగా గుర్తింపు. మృతుడు సులూరుపేట సమీపంలోని ఓ కాలేజీలో రెండవ సంవత్సరం బీటెక్ చదువుతున్నట్టు సమాచారం. రంజాన్ పండుగకు వచ్చి మృతి చెందడంతో దుఃఖ సాగరంలో మునిగిన బంధువులు . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నపాకాల సీఐ రాంప్రసాద్.




