

పార్వతీపురం మండలం చినమరికి గ్రామంలో తెలుగు జాతి కీర్తి శేషులు తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాతి సార్వభౌములు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం, తెలుగు ప్రజలు కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు, కార్యకర్తలు ప్రతిఫలం, ప్రజలు అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించి, తెలుగుదేశం జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చినమరికి గ్రామ తెలుగుదేశం నాయకులు గవర గుంప స్వామి నాయుడు, మైసర్ల సత్యం నాయుడు, మైసర్ల తవిటి నాయుడు, గవర శంకర్రావు, డొల్లు శ్రీరాములు, నక్కేర్ల సత్యం నాయుడు, అగినేండ్రపు పకీరు నాయుడు, గవర జమ్మి నాయుడు, అగినేండ్రపు దాలినాయుడు, గొబ్బూరు శంకర్రావు, రాజు బెవర, కార్యకర్తలు నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
