
ఉగాది పండుగ సందర్భంగా పేదలకు నిత్యవసర వస్తువుల పంపిణీ….!!
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 29 (గరుడ న్యూస్)
స్థానిక జిల్లా కేంద్రంలోని అనంతారం శివారు మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో ఉగాది పండుగను పురస్కరించుకొని స్కూల్లో పనిచేసే అటెండర్లు మరియు స్కావెంజర్లకు తెలుగు ఉపాధ్యాయురాలు అమ్మ దీవెన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జీవన వీణ రచయిత్రి కీర్తన రెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు చేతుల మీదుగా నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
