
గరుడ న్యూస్,సాలూరు
ముందస్తు గా ఉగాది కార్యక్రమాలు శుక్రవారం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం లో ఘనం గా నిర్వహించారు. శుక్రవారం శ్రీవారికి పంచామృత, హరిద్రాచూర్ణాది సుగంధ ద్రవ్యము, పళ్ళ రసములు, విశేష జలాలతో అభిషేకం కార్యక్రమం జరిగింది.ఆలయ అనువంశిక ధర్మకర్త వంగపండు రాజేంద్ర ప్రసాద్,అర్చకులు నారాయణాచార్యులు ఆద్వర్యంలో కైంకర్యములు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

