రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి30,(గరుడ న్యూస్ ప్రతినిధి)
నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ ప్రాచిన ఉమామహేశ్వరి(శివాలయం), దేవాలయంలో ఉగాది పండగ పురస్కరించుకొని గత 5 ఐదు సంవత్సరాలుగా 10,000 పది వేల రూపాయలు విరాళంగా అందజేస్తున్నారు.ప్రతి సంవత్సరం లాగే ఈ ఉగాది పండగ రోజు న ఉమామహేశ్వరి దేవాలయంలో ని సిబ్బందికి 10,000 పది వేల రూపాయలు నగదు విరాళంగా అందజేసిన నారాయణపురం మండలం చిమిరియాల గ్రామ వాస్తవ్యులు దండగుల ప్రభాకర్,వారి కుటుంబ సభ్యులు అనంతరం ఉగాది సందర్భంగా దేవాలయ సిబ్బందికి సహకరిస్తున్నటువంటి ప్రభాకర్ కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు దేవాలయ అధ్యక్షులు మరియు కమిటీ వారు.ఈ కార్యక్రమంలో దండుగుల నగేష్,ఉప్పల నాగరాజు,కొండా శ్రీకాంత్ గౌడ్,దండుగుల మల్లేష్,ప్రాచీన ఉమామహేశ్వర శివాలయం దేవాలయ అధ్యక్షులు పాలకూర్ల సతీష్ గౌడ్,మాజీ అధ్యక్షులు పాలకూర్ల యాదయ్య గౌడ్,ప్రధాన కార్యదర్శి సూరపల్లి జోహార్,భక్తులు,తదితరులు,పాల్గొన్నారు.




