రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,మార్చి31,(తెలంగాణ గళం):
భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమ,శాంతి,సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను (ఈద్-ఉల్-ఫితర్) జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఐఎన్టియుసి చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులను అలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక,చింతనల కలయికే రంజాన్ పర్వదినం అన్నారు.అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నరసింహ్మ గౌడ్,ముస్లిం సోదరులు,తదితరులు పాల్గొన్నారు.



