


రేణిగుంట గరుడ న్యూస్ (ప్రతినిధి): రేణిగుంట గంగమ్మ గుడి చైర్మన్ సోలా మల్లికార్జున్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రేణిగుంట పట్టణంలోని గంగమ్మ గుడి ఆవరణంలో సోమవారం జరిగిన జన్మదిన వేడుకల్లో పలువురు, నాయకులు, ప్రముఖులు, స్నేహితులు, పాల్గొన్నారు. ముందుగా కేకులు కట్ చేసి, అభిమానులందరికీ పంచిపెట్టారు, సోలా మల్లికార్జున రెడ్డిని, ప్రముఖులు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
