
తిరుపతి జిల్లా, పాకాల గరుడ న్యూస్ (ప్రతినిధి): మత సామరస్యానికి ప్రతీక రంజాన్. ముస్లీం సోదరులకు అల్లా దీవెనలు అందాలి. రంజాన్ వేడుకల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అని తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని చంద్రగిరి ఈద్గా మైదానంలో సోమవారం జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఇలాంటి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. నెల రోజుల పాటు ఉపవాసాలు చేపట్టి పవిత్ర మనస్సుతో అల్లాను ధ్యానించడం శుభ పరిణామం అన్నారు. రంజాన్ మాసం పవిత్ర మాసంగా పరిగణించే ముస్లీం సోదరులకు మంచి జరగాలని, ఆ కుటుంబాలకు అల్లా దీవెనలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అంతకుముందు ముస్లీం మత గురువుల ఆశీస్సులు తీసుకున్న మోహిత్ రెడ్డి ప్రార్థనలు పూర్తి చేసుకున్న ప్రతి ముస్లీం సోదరునితో కరచాలనం చేస్తూ ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


