
గరుడ న్యూస్,సాలూరు
జై శ్రీమన్నారాయణ 31 వ తారీకు స్థానిక పెద్ద కోమటి పేట రామాలయంలో లోక కళ్యాణార్థం ఓం శ్రీ కిట్టి బృందంచే రామ చరిత నామామృతగానం అమృత ప్రాయంగా జరిగింది.చిన్నారుల తో కోలాటం నృత్యాలు సాంప్రదాయాన్ని ముందుకు తేవడానికి ప్రయత్నించారు.పెద్దలతో తులసీమాల ధారణ చేయించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా కమిటీ సభ్యులకు సబ్బిశెట్టి వెంకటరత్నం ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞలు తెలిపారు.శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఓం శ్రీ బృందం శ్రీరామ చరిత నామామృత గానాన్ని పారాయణం చేశారు. అనంతరం మన సాంప్రదాయ లనే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రశ్నోత్తర ప్రవల్లిక రామాయణ అవగాహన కోసం నిర్వర్తించారు.


