తెలంగాణ, గరుడ న్యూస్ (ప్రతినిధి): రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్1,(గరుడ న్యూస్ ప్రతినిధి):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని రేషన్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి నెలకు 6 కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం రోజు సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని కార్డుదారులకు సన్నాబియ్యం కార్యక్రమం పంపిని చేస్తుందని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిల పెట్టుకొని కొన్ని వేల కుటుంబాలలో పేదలకు అన్నం పెడుతున్నారని తెలిపారు.ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి రేపు జరిగే మంత్రివర్గ విస్తరణ లో మంత్రి పదవి ఖాయమని నియోజకవర్గ తాగు, సాగునీరు, అన్ని రంగాలలో మంత్రి గా ముందుకు తీసుకెళ్తాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి,నారాయణపూర్ తాసిల్దార్ కృష్ణ,నారాయణపురం మండలం మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ఫ్రేమ్ చందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి వీరుమల భానుమతి వెంకటేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఏపూరి సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి, ఉప్పల లింగస్వామి, దోనూరు జైపాల్ రెడ్డి, మునగాల రమణారెడ్డి, జక్కలి ఐలయ్య, నోముల మాధవరెడ్డి, కొన్ రెడ్డి నరసింహ్మ,రేషన్ డీలర్లు మహేశ్వరం స్వామి, యాదయ్య, చిలుకూరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




