పేదవాడి ఇంటికి సన్న బియ్యం పథకం ప్రజా పాలనకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మాజీ జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్

Panigrahi Santhosh kumar
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భవనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్3,(గరుడ న్యూస్ ప్రతినిధి):

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గం అంతా అమలవుతుందని సంస్థాన్ నారాయణపురం మండలం మాజీ జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రజాపాలనకు నిదర్శనమని తెలిపారు.పేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలియజేశారు.ప్రజలందరి కోరికలకు అనుగుణంగా సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు.గతంలో ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజాపాలన చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *