
విజయనగరం జిల్లా, రామభద్రపురంలోని పి ఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 12 రోజులు సమ్మర్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం జరుపబడునని ప్రధానోపాధ్యాయులు కే కామేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం రామభద్రపురంలోని జానీ బైక్ మెకానిక్ షాప్ కు విద్యార్థులను ఒకేషనల్ ఆటోమోటివ్ ట్రేడ్ శిక్షకురాలు బి ప్రమీల కుమారి తీసుకుని వెళ్లడం జరిగింది. విద్యార్థులకు ఒకేషనల్ శిక్షకురాలు ప్రమీల కుమారి మెకానిక్ జానీ బైక్ ఇంజన్ పనితీరు, విడిభాగాలు పై అవగాహన కల్పించారు.



