సంక్షేమానికి, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత – ఎమ్మెల్యే విజయ్ చంద్ర

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు శుక్రవారం సాయంత్రం పురపాలక సంఘం ఐదు, ఎనిమిది వార్డుల్లో సీసీ రోడ్లు కాలువలకు ఆయన శంకుస్థాపన చేశారు ఆ రెండు వార్డులోని కొత్త వీధి పెద్దవీధి సాయిరాం కాలనీలో₹11.35 లక్షలతో కాలువలు సిసి రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యతీస్తూ ముందుకు వెళుతుందన్నారు పేద ప్రజల అభ్యున్నతి వారి సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది అలాగే సిసి రోడ్లు కాలువలు గృహ నిర్మాణం ఇతర అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డిఇ శ్రీనివాసరావు, కౌన్సిలర్స్, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *