
రిపోర్టర్ సింగం కృష్ణ, భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,కొర్రతండా,ఏప్రిల్ 5(గరుడ న్యూస్ ప్రతినిధి):
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో కొర్ర తండాలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చౌకదారుల ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.తండావాసులకి బియ్యాన్ని అందజేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గిరిజన ప్రాంత ప్రజలకు అభివృద్ధి చేకూరుస్తూ ఉన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రతి ఒక్క గిరిజన వాసులు తండా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కరంటోత్ శ్రీనివాస్ నాయక్,కోర్ర జాగ్రామ్ నాయక్,మాజీ సర్పంచ్ కొర్ర లచ్చిరాం,మాజీ ఉప సర్పంచ్ కొర్ర నాను,శంకర్,కొర్ర శ్రీను నాయక్,శంకర్ నాయక్,మంగ్త నాయక్,గోవర్ధన్,కరంటోత్ రాములు,కొర్ర మోహన్,లాల్ సింగ్,తదితరులు పాల్గొన్నారు

