

ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐటిడిఏ పిఓ అశుతోష్ శ్రీ తో కలిసి సౌందర్య సెంటర్ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేశారు. అనంతరం కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు దళితులకు స్వాతంత్ర్యం అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల వల్ల వచ్చిందని అన్నారు. ఈరోజు ఈ స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే వారి చదివే అన్నారు. దేశంలో అనేక సంస్కరణలు అమలు చేసి గొప్ప పేరు ప్రఖ్యాతలు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ పొందారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. కూటమి ప్రభుత్వం అనేక సౌకర్యాలు అవకాశాలు కల్పిస్తుందని వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖంగా జీవించవచ్చని అందుకు ఇప్పుడే కష్టపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు



