
గోదావరి జిల్లా, కొత్తపేట గరుడ న్యూస్ (ప్రతినిధి): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రాం జయంతి సందర్భంగా కొత్తపేటలోని జగజ్జీవన్ రాం విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రాం చేసిన సేవలను కొనియాడారు. ఈ కంఠంశెట్టి శ్రీనివాస్, బూసి జయలక్ష్మి భాస్కరరావు, విల్లా మారుతీ, రాజకుమార్ వాడయర్,ధరణాల రామకృష్ణ, బీర ఇస్సాక్, దేవపాటి వెంకటేశ్వరరావు, నల్ల రమణ, పల్లికొండ సుధీర్, ముద్రగడ సుబ్బారావు, బండి రాజు, కముజు శ్రీను మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.


