

కొఠియా పై అంతుబట్టని ప్రభుత్వ ఆలోచన!!_ ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు వివాదాస్పద కొఠియా గ్రూపు గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వం అక్రమంగా చొరబడి ఒక్కో గ్రామంలో తిష్టవేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనం గా ఉండటం వెనక అసల విషయం గిరిజనులకు అర్ధం కాలేదని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తంచేశారు శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దశాబ్దాల కాలం గా ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో 21 గ్రామాలు వివాదాల్లో ఉన్నాయని ఇరు రాష్ట్రలవారు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వారు స్టేటస్కో విధించారని ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవం తో వ్యవహరిస్తున్నా ఒడిశా ప్రభుత్వం,అధికారులు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తూ 21 గ్రామాల గిరిజన ప్రజల్ని బయపెడుతూ గ్రామాలని అక్రమిస్తోందని ఆరోపించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు,ప్రభుత్వం లోని పెద్దల చేతగానితనం వల్ల ఒడిశా ప్రభుత్వం దిగువ సెంబి గిరిజన గ్రామం వద్ద పవర్ ప్రాజెక్ట్ కట్టె పరిస్థితి కి వచ్చిందని దుయ్యబట్టారు, గిరిజనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడు పట్టాలు ఇచ్చి గిరిజనులకు అంగన్వాడీ భవనాలు నిర్మిస్తే అవికూడా ఒడిశా ప్రభుత్వం కూల్చివేసి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను,రెవెన్యూ అధికారులను కొఠియా వివాదాస్పద గ్రామాల్లో తిరగనియ్యకుండా చేస్తుందని,ఒడిశా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక పైకి వచ్చి తమ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గిరిజనులకు అండగా వారి హక్కుల కోసం ఒక్క లోక్ సత్తాపార్టీ మాత్రమే 2019 నుండి పనిచేస్తుందని భీశెట్టి అన్నారు,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి కొఠియా వివాదాస్పద గ్రామాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలపాలని భీశెట్టి డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పౌర వేదిక ప్రధాన కార్యదర్శి జలంత్రి రామచంద్ర రాజు,కార్యదర్శి తుమ్మగంటి రాంమోహన్ రావు,పార్టీ జిల్లా ప్రతినిధి అల్లంశెట్టి నాగభూషణం పాల్గొన్నారు.