
రామకోటితో దద్దరిల్లిన గ్రామం
ఇటుక నెల్లూరులో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు సనాతన ధర్మ పరిరక్షణ దక్షకుడు బోయకొండ ఆలయ మాజీ చైర్మన్లు ఎస్కె రమారెడ్డి రతీదేవిల ఆధ్వర్యంలో గ్రామంలోని సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరాములకు విశేషాభిషేకము అలంకరణ గావించారు అనంతరం ఆలయం ముందు రామకోటి కార్యక్రమాన్ని నిర్వహించారు పగలంతా రామకోటితో గ్రామం దద్దరిల్లింది ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో తరలివచ్చి రామకోటిని తిలకించారు అధిక సంఖ్యలో వస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని ఎస్కేఆర్ ఉచిత భోజన వసతి కల్పించారు

