పూజా కార్యక్రమంలో అగ్నిలో వినాయకుని రూపం
సనాతన ధర్మ పరిరక్షకుడు బోయకొండ మాజీ చైర్మన్ పురాతన దేవాలయాల పునర్నిర్మాణదాత ఎస్.కె వెంకటరమణారెడ్డి తన సొంత గ్రామంలో సొంత నిధులతో నిర్మించిన సీతారాముల ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ క్రమంలో ఉదయాన్నే రామకోటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రారంభ సమయంలో ఆయన సీతారామ చిత్రపటానికి హారతి ఇచ్చారు ఈ హారతిలో కర్పూర దీపం వినాయకుని రూపాన్ని కలిగి ఎస్కేఆర్ ను ఆశీర్వచనం చేసినట్లుగా ఉంది గుర్తించిన ఆయన తో పాటు స్థానికులు సీతారాములకు విశేష పూజలు నిర్వహించారు




