
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్7,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని మండల శాఖ అధ్యక్షులు సుర్వి రాజుగౌడ్ అధ్వర్యంలో బిజెపి జెండా ఆవిష్కరించడం జరిగింది.అనంతరం మండలం కేంద్రంలోని 98వ బూత్ లో లచ్చమ్మగూడెం,పుట్టపాక,గుజ్జ మల్లారెడ్డిగూడెం,అల్లందేవిచెర్వు గ్రామంలో బీజేపీ జెండాలను ఆయా గ్రామాల బూత్ అధ్యక్షులు ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి,పాల్గొని మాట్లాడుతూ 1980 లో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం నరేంద్ర మోడీ నేతృత్వంలో వరుసగా 3 మూడుసార్లు గెలిచి,గత 11 సంవత్సరాలుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని,వారి స్పూర్తితో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్,ఒబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కిలి రాజు యాదవ్,జిల్లా నాయకులు వంగరి రఘు,దాసోజు వెంకటాచారి,సంపతి సుధాకర్ రెడ్డి,ఉష్కాగుల గిరిబాబు,నందగిరి జగత్ కుమార్,బండమీది కిరణ్,కుకుడాల మహేందర్ రెడ్డి,సుర్వి వెంకటేష్ గౌడ్,బూస శీను,ఎలిజాల శీను,నర్రి నర్సింహా,నెల్లికంటి శ్రీశైలం,చక్రి,గూడూరు మంజునాథ్ రెడ్డి,బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

