
గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం నావంతు కృషి చేస్తా.
వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి : ఎమ్మెల్యే సత్యానందరావు. నియోజకవర్గంలో ఉపాధి,ఉద్యోగ అవకాశాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం బాలుర ఉన్నత పాఠశాలలో పీఎం సూర్య ఘర్ ఎం యు ఎఫ్ టీ బిజ్లీ యోజన పథకం మరియు యువ నాయకులు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధి, ఉద్యోగ అవకాశాల శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 60 మంది నమోదు చేసుకున్నారని నిరుద్యోగులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా తొమ్మిది రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ,కేవీ సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, పాలూరి సత్యానందం మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


