

గంజాయి సేవించే, వినియోగించే వారి వివరాల సేకరణ కోసం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ,ఐపిఎస్
అందరి సహకారంతో ఆన్లైన్, ఆఫ్లైన్ ఫామ్స్ ద్వార గంజాయి సేవించే, వినియోగించే వారి వివరాలు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలి..
గంజాయి సేవించే, వినియోగించే వారిని కనిబెట్టి వారికీ కౌన్సిలింగ్ నిర్వహించాలి.

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని గల కాన్ఫరెన్సు హాల్ నందు గంజాయి సేవించే/వినియోగించే వారి వివరాల సేకరణ కోసం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి,ఐపిఎస్ మాట్లాడుతూ ప్రజలు/యువత మత్తుపదార్దాలకు బానిస కాకూడదని వాటివల్ల జీవితం నాశనం అవుతుందని అన్నారు. కొన్ని పాశ్చాత్య దేశాలు మత్తు పదార్దాలు వినియోగానికి అలవాటు పడి దేశ వినాశనానికి పాల్పడ్డారని తెలియజేస్తూ మాదక ద్రవ్యాల వినియోగం వలన సామాజిక, మానసిక, శారీరక, అనారోగ్యాలు తలెత్తుతాయని, గంజాయి వాడకం వళ్ళ మెదడు అదీనంలో వుండదు దానివల్ల నేరాలకు పాల్పడి జీవితం నాశనం అవుతుందని, తక్కువ వయస్సు లో ఈ గంజాయికి అలవాటు పడడం వలన నేర ప్రవృత్తికి దోహదం చేస్తుందని వాటిని నిర్మూలించే దిశగా గంజాయి సేవించే, వినియోగించే వారికోసం కొత్తగా ఆన్లైన్/ఆఫ్లైన్ ఫామ్స్ రూపొందించడం జరిగిందని ఆన్లైన్/ఆఫ్లైన్ ఫామ్స్ లో దీనిద్వారా ఒక ప్రణాళిక సర్వేద్వార గంజాయి సేవించే వారి వివరాలు నమోదు పరిచేలా క్లుప్తంగా సమాచారం అందుబాటులో ఉండేలా ఉందన్నారు. గంజాయి వినియోగదార్లను మూడురకాలు వర్గీకరించడం జరిగిందని, వారి యొక్క స్తితిని బట్టి వర్గీకరించి వారి వివరాలు మనం తెలుకోవడం వళ్ళ వారికీ కౌన్సిలింగ్ ఇవ్వడం లేదా పునరావాస కేంద్రాలు పంపడం వంటి చర్యలు చేపట్టవచ్చు అన్నారు. వీటిలో వివరాలు ఎలా నమోదు చేయాలి అని ప్రజలకు,యువతకు, విద్యార్దులకి అవగాహన కల్పించి వారి చుట్టుపక్కల ఎవరైనా గంజాయి సేవించే వ్యక్తులు ఉన్నట్లయితే వారియొక్క సమాచారం వీటి ద్వార తెలియజేసేలా అన్ని శాఖల సమన్వయం అవసరమన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలను వివరించి వారిలో చైతన్యం తీసుకొని వచ్చి డ్రగ్స్ బారిన పడకుండా చేయడానికి, అలాగే మీ చుట్టుపక్కల తెలిసిన వ్యక్తులు గాని,స్నేహితులు గాని ఎవరైనా మత్తుపదర్దాలకు బానిస అయినట్టు తెలిసిన వినియోగం గురింఛి ఎటు వంటి సమాచారం వున్నా ఈ రూపొందించిన ఆన్లైన్/ఆఫ్లైన్ ఫామ్స్ లో వారి వివరాలు నమోదు పరిచేలా అవగాహన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అన్ని స్కూళ్లలో , కళాశాలలో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన నిర్వహించాలని డీఈవో ఆదేశించారు. అదేవిధంగా గంజాయి సేవించే/వినియోగించే వారి వివరాలు తెలుసుకోడానికి సమావేశానికి హాజరైన వివిధ శాఖల అధికారుల సలహాలు కూడా తీసుకొని వాటికీ తగ్గ కార్యాచరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటుగా పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన, ఐపిఎస్, CCS సిఐ అప్పరావు , జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
