
గరుడ న్యూస్,సాలూరు
గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, ఎకో టూరిజం ప్రోత్సాహం పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో డుంబ్రి గూడ మండలంలో మారుమూల పల్లెల్లో రహదారుల నిర్మాణాలకు “అడవి తల్లి బాట” పేరిట చేపట్టిన రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన తదుపరి బహిరంగ సభ నిర్వహించారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ,గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తో పాటు అతిరధ మహారధులు పాల్గొన్నారు.

