అవిడి కాలువ డ్రైన్ పూడిక తొలగింపు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు

Sesha Ratnam
0 Min Read

గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): కొత్తపేట మండలం అవిడి గ్రామంలో గోరింకలకాలువలో కలిసి డ్రైన్ పూడిక తొలగింపు పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని కనీసం కాలువలు, డ్రెయిన్లను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రైతులకు అండగా ఉంటామని అందుకే రైతులకు ఉపయోగకరమైన పనులు కూటమి ప్రభుత్వం చేపడుతుందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *