
గరుడ ప్రతినిధి పుంగనూరు

చౌడేపల్లి మండలం లో దిగుపల్లి పంచాయతీ లో వెలిసి ఉండు స్వయంభు శ్రీ బోయకొండ గంగమ్మ కు పెద్దపంజాణి మండలం బట్టము దొడ్డికి చెందిన మోహన్ రెడ్డి250 గ్రాములు వెండి కిరీటాన్ని విరాళంగా అందజేశారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏకాంబరం ఆలయం మర్యాదలతో దాతకు అమ్మవారి దర్శనం భాగ్యం కల్పించారు తీర్థప్రసాదాలును అందించారు, దాతల సాయాన్ని కొనియాడారు. కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని దాతలు అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది లాయర్ వెంకట ముని, తదితరులు పాల్గొన్నారు