
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో 60 మంది హై రిస్క్ గర్భవతులను పరీక్షించి మందులు, సూచనలు, తల్లి బిడ్డ సురక్షిత ప్రస్తావనానికి సంపూర్ణ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు, సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం కింద ప్రతినెల 9వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ పార్వతమ్మ, పి హెచ్ ఎన్ కృష్ణవేణి అమ్మ, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు