కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు

Sesha Ratnam
0 Min Read

గోదావరి జిల్లా, కొత్తపేట గరుడ న్యూస్ (ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ శ్రేణులతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సత్యానందరావు కార్యకర్తలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సాధికారత సర్వేను పూర్తి చేయాలని సూచించారు. కార్యకర్తలకు పార్టీ నాయకులు అందుబాటులో ఉండాలని తెలిపారు. పార్టీ శ్రేణుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *