
గరుడ న్యూస్,పాచిపెంట
ఏకపంట విధానంతో పోలిస్తే అంతర పంటలు పలుపంటల విధానం ఎంతో మేలని భూసారాన్ని పరిరక్షించడమే కాకుండా అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు అన్నారు. కేసలీ గ్రామంలో రైతుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు కేవలం రసాయన ఎరువుల మీదే ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తుండడం వలన గత మూడు సంవత్సరాల తో పోలిస్తే వ్యవసాయ దిగుబడులు తగ్గుతూ రసాయన ఎరువులు పై పెట్టుబడులు పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారని దీనిని నివారించాలంటే పంట మార్పిడి పాటించాలని లేదా పిఎండిఎస్ నవధాన్య విత్తనాలు చల్లిన తర్వాత మాత్రమే ప్రధాన పంటను వేసుకోవాలని ప్రధాన పంట లో కూడా చిరుధాన్యాలు కూరగాయలు అపరాలు వంటివి అంతర పంటలుగా వేసుకుంటే భూసారం పెరగడమే కాకుండా భూమి లోపల బయట జీవావరణ వ్యవస్థ మెరుగుపడి జీవ వైవిధ్యం పెరుగుతుందని తద్వారా చీడ ,పీడలఉధృతి ఘనంగా తగ్గుతుందని తెలిపారు. గ్రామంలో పెంట కుప్పలు ఎక్కువగా ఉన్నాయని ద్రవ జీవామృతం ఉపయోగించి టైప్ టు ఘన జీవామృతాన్ని తయారు చేసుకుని పంట పొలాలకు వినియోగించుకుంటే అనేక రెట్లు పోషకాలు పంటకు అందడమే కాకుండా భూమిలో సేంద్రీయ పదార్థం పెరుగుతుందని సూచించారు. అనంతరం రైతు మీసాల మోహన్ రావు గులి పద్ధతిలో సాగుచేసిన చోడి పంటను పరిశీలించారు గులి పద్ధతిలో చోడి పంట దిగుబడులు చాలా బాగున్నాయని రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అనంతరం ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేస్తున్న మిరప టమోటా వంగ పంటలను పరిశీలించారు. అనంతరం చిరుధాన్యాలు నవధాన్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ గ్రామంలో ర్యాలీని కొనసాగించారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు రాకేష్ కుమార్, రైతులు పాల్గొన్నారు.

