రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చౌటుప్పల్,ఏప్రిల్10,(గరుడ న్యూస్ ప్రతినిధి):
కేంద్రంలో బిజెపి మోదీ,సర్కార్ వంట గ్యాస్ ధర 50 రూపాయలు,డీజిల్ ,పెట్రోల్ 2 రెండు రూపాయలు పెంచి ప్రజలపై భారం వేయడాన్ని నిరసిస్తూ,తగ్గించాలని డిమాండ్ చేశారు ఐ ఎన్ టి యు సి చౌటుప్పల్ మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా.ఈ సందర్భంగా చాంద్ పాషా మాట్లాడుతూ
పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని దీనివల్ల పేద ప్రజలకు భారం పెరుగుతుందని ఆయన తెలియజేశారు.అంతర్జాతీయంగా డీజిల్,గ్యాస్,ధరలు తగ్గిన దేశంలో ధరలు పెంచి ప్రజలపై భారం వేయడం దుర్మార్గమైన చర్యని ఆరోపణ చేశారు.ఈ చర్య వల్ల అన్ని నిత్యవసర సరుకులు ధరలు పెరుగుతున్నాయని అన్నారు.నిరుద్యోగం ఆకలి,దారిద్రం,ద్రవయోల్బణం లాంటి సమస్యలను అదుపు చేయకుండా వ్యవహరిస్తున్నారని,ఇప్పటికే పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమయంలో ఈ పెంపు మరింత భారమని విమర్శించారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.




